![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-378 లో......అమూల్య పెళ్లి సందడిలో భాగంగా సంగీత్ ఏర్పాటు చేస్తారు. ధీరజ్ యాంకరింగ్ చేస్తూ ఉంటాడు. మొదటగా నర్మద, సాగర్ డాన్స్ చేస్తారు. ఆ తర్వాత చందు, శ్రీవల్లి, ప్రేమ, ధీరజ్ ఆ తర్వాత రామరాజు,వేదవతి ఇలా అందరూ జంటగా కలిసి డ్యాన్స్ చేస్తుంటారు. మీ నాన్నకి ఇలాంటివి అంటే చాలా సరదా అని శ్రీవల్లికి భాగ్యం చెప్తూ ఆనందరావుతో కలిసి డాన్స్ చేస్తున్నట్లు ఉహించుకుంటుంది.
ఆ తర్వాత అబ్బాయి కుటుంబం అమ్మాయి కుటుంబం కలిసి డ్యాన్స్ చేస్తారు. అందరు ఎంజాయ్ చేస్తారు. శ్రీవల్లి మాత్రం విశ్వ గురించి భయపడుతుంది. విశ్వ ఫోన్ చేస్తాడు. ఫోన్ తీసుకొని వెళ్లి అమూల్యకి ఇస్తుంది శ్రీవల్లి. వదిన వాడు ఫోన్ చేస్తే ఇవ్వకు అన్నాను కదా.. ఇలా చేస్తే అన్నయ్యకి చెప్తానని అమూల్య అంటుంది. ఈ ఒక్కసారి మాట్లాడమని శ్రీవల్లి అనగానే అమూల్య సరే అని ఫోన్ మాట్లాడుతుంది. అమూల్య నీతో ఒకసారి మాట్లాడాలి బయటకి వస్తావా అని అడుగుతాడు. రానని అమూల్య చెప్తుంది. ప్లీజ్ అమూల్య జీవితాంతం నేను ఇలాగే బాధపడుతూ ఉండాలా అని విశ్వ అంటాడు.
ఏం లేదు అమూల్య.. ఒక్క అడుగు త్వరగా వెళ్లి మాట్లాడి వచ్చేద్దామని శ్రీవల్లి చెప్పగానే విశ్వతో అమూల్య సరే అంటుంది. ఆ తర్వాత వేదవతి వచ్చి అమూల్యకి అన్నం తినిపిస్తుంది. భాగ్యం, శ్రీవల్లి కలిసి అమూల్యని ఎలా బయటకు తీసుకొని వెళ్ళాలని ఆలోచిస్తారు. ఇంట్లో కరెంటు ఆఫ్ చేస్తారు. తరువాయి భాగంలో అమూల్య బయటకు మాట్లాడటానికి వెళ్తుంది. విశ్వ తనని బలవంతంగా తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |